Wednesday, July 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎన్జీకేఎల్ జేఏసీ చైర్మన్‌గా సత్యనారాయణ రెడ్డి ఏకగ్రీవం

ఎన్జీకేఎల్ జేఏసీ చైర్మన్‌గా సత్యనారాయణ రెడ్డి ఏకగ్రీవం

- Advertisement -

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం
విద్యార్థుల అభ్యున్నతికి జేఏసీ కృషి చేయాలి
జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్
నవతెలంగాణ – తిమ్మాజిపేట
: నాగర్ కర్నూల్ జిల్లా ఉపాధ్యాయుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ జేఏసీ గా ఏర్పడి 25 ఉపాధ్యాయ సంఘాల భాగస్వామ్యంతో నూతన జెఎసి కమిటీని మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఎన్నుకున్నట్లు జిల్లా ఆర్గనైజింగ్ కన్వీనర్ రూపు జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్ తెలిపారు. ఉపాధ్యాయ జేఏసీ జిల్లా చైర్మన్ గా సత్యనారాయణ రెడ్డి, గౌరవ చైర్మన్ గా జిహెచ్ఎం శ్రీనివాస్ రెడ్డి, సెక్రటరీ జనరల్గా డాక్టర్ శ్రీధర్ శర్మ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వెల్లడించారు. నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతానికి ఉపాధ్యాయ జేఏసీ పనిచేస్తుందని జేఏసీ కమిటీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, గౌరవ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్గనైజింగ్ కన్వీనర్ విజయ్ కుమార్ లు తెలిపారు.

విద్యారంగ అభివృద్ధికి, పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలను అమలు చేసేందుకు జేఏసీ పనిచేస్తుందని తెలిపారు. అనంతరం డిఇఓ రమేష్ కుమార్ ను డిఇఓ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ ఉపాధ్యాయ జేఏసీ నూతన కమిటీని డిఇఓ అభినందించారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు, విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపుకు నూతనంగా ఏర్పడిన ఉపాధ్యాయ జేఏసీ ప్రత్యేకంగా కృషి చేయాలని డిఇఓ సూచించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తేనే ప్రభుత్వ ఉపాధ్యాయులకు మనుగడ ఉంటుందని డిఈఓ ఈ సందర్భంగా తెలిపారు. డీఈఓ కార్యాలయం నుండి ఉపాధ్యాయుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని డిఈవో హామీ ఇచ్చారు. సహకార వాతావరణంలో ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు కలిసి పనిచేయడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యారంగంలో మరింత అభివృద్ధి సాధించవచ్చని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -