Wednesday, July 16, 2025
E-PAPER
Homeసినిమాజంధ్యాల సినిమాలా..

జంధ్యాల సినిమాలా..

- Advertisement -

రానా దగ్గుబాటి స్పిరిట్‌ మీడియా ప్రజెంట్‌ చేస్తున్న రూరల్‌ కామెడీ చిత్రం ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’. ‘కేరాఫ్‌ కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాల నిర్మాత, నటి ప్రవీణ పరుచూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్‌ ఈ ప్రాజెక్జ్‌ను నిర్మించింది. మనోజ్‌ చంద్ర, మోనికా ప్రధాన పాత్రలు పోషించారు. సినిమా విడుదల నేపథ్యంలో డైరెక్టర్‌ ప్రవీణ పరుచూరి మంగళవారం మీడియాతో పలు విశేషాలను షేర్‌ చేసుకున్నారు.
నాకు డైరెక్షన్‌ చేయాలని ఆసక్తి ఎప్పటి నుంచో ఉంది. అది దీంతో నెరవేరింది. ఇందులో నా క్యారెక్టర్‌ చాలా ఫన్‌ అందిస్తుంది. ఊర్లో ఉండే మహిళలు కాస్త టఫ్‌గా ఉంటారు. నాది కూడా అలాంటి టఫ్‌ క్యారెక్టర్‌.
‘పుష్ప’ సినిమాలో జాతర సీన్‌ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో ఇందులో అలాంటి ఒక సీక్వెన్స్‌ ఉంది. ఈ సినిమాకి చాలా మంచి స్క్రీన్‌ ప్లే కుదిరింది. అలాగే విజువలైజేషన్‌ మంచి ట్రీట్‌ ఇస్తుంది. ఇందులో ఒక సూపర్‌ నేచురల్‌ ఎలిమెంట్‌ ఉంది. మనకి గ్రామ దేవతలపై విశ్వాసం, నమ్మకం ఉంటుంది. అలాంటి ఒక నమ్మకాన్ని చాలా న్యూట్రల్‌గా చూపించాం. ఈ సినిమా ప్రివ్యూస్‌కి చాలా అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. చాలా మంది దర్శకుడు పెద్ద వంశీ సినిమా లాగా ఉందని చెప్పారు. అది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమా చూస్తున్నప్పుడు కూడా జంధ్యాల సినిమా లాగా మన చుట్టూ జరుగుతున్న కథలాగే అనిపిస్తుంది. ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌.
‘కేరాఫ్‌ కంచరపాలెం’ నుంచి రానా మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. ఈ సినిమాని ఆయన ప్రజెంట్‌ చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నా. ‘కేరాఫ్‌ కంచరపాలెం’కి మించి ఈ సినిమా వినోదాన్ని అందిస్తుంది. నా గత రెండు చిత్రాల మాదిరిగానే ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -