Wednesday, July 16, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్గవర్నర్‌ వద్దకు బీసీ రిజర్వేషన్ల ముసాయిదా

గవర్నర్‌ వద్దకు బీసీ రిజర్వేషన్ల ముసాయిదా

- Advertisement -

వారం రోజుల్లో గెజిట్‌ నోటిఫికేషన్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

బీసీలకు రిజర్వేషన్ల పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించి న ఆర్డినెన్స్‌ ముసాయిదా మంగళవారం రాజ్‌భవన్‌కు చేరింది. రిజర్వేషన్ల పెంపునకు వెసులుబాటు కల్పిస్తూ పంచాయతీరాజ్‌ చట్టం 2018లోని సెక్షన్‌ 285 క్లాజ్‌-ఎ సవరించాలని ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ సెక్షన్‌లో స్థానిక సంస్థల్లో 50 శాతానికి మించకుండా రిజర్వేషన్లు అమలవుతాయని ఉండగా..ఇప్పుడు 50 శాతానికి మించకుండా అనే వాక్యాన్ని తొలగిస్తూ ముసాయిదా రూపొందించింది. బీసీ రిజర్వేషన్ల పంచాయితీకి సాధ్యమైనంత త్వరగా ముగింపు పలకాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఉన్నారు. మంత్రి సీతక్క కార్యాలయం నుంచి ముసాయిదా సీఎంవోకు వచ్చిన వెంటనే దాన్ని గవర్నర్‌ పరిశీలనకు పంపారు. గవర్నర్‌ ఆమోదంం పొందిన వెంటనే వారం రోజుల్లోగా గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు పంచాయతీరాజ్‌ శాఖ కసరత్తు చేస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -