Saturday, July 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అన్ని రంగాల కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి: సీఐటీయూ

అన్ని రంగాల కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి: సీఐటీయూ

- Advertisement -

విలేకరుల సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు పుట్ట ఆంజనేయులు 
నవతెలంగాణ – పెబ్బేరు 
: అన్ని రంగాల్లో పనిచేసే కార్మికుల అందరికీ కనీస వేతనం రూ.26 వేల ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు పుట్ట ఆంజనేయులు అన్నారు. బుధవారం పెబ్బేరు ప్రెస్ క్లబ్ లో సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్ ఎన్ రమేష్, మండ్ల రాజు తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వనపర్తి జిల్లా సీఐటీయూ నాలుగో మహాసభలు రెండు రోజులపాటు జరిగాయని, మహాసభలను అన్ని రంగాల కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారన్నారు. మహాసభల సందర్భంగా రాష్ట్ర కార్యవర్గం తీర్మానాలను ప్రవేశపెట్టిందన్నారు. స్కీం వర్కర్స్  అందరిని కార్మికులుగా గుర్తించాలని, పిఎఫ్ ఈఎస్ఐ గ్రాట్యూటీ పెన్షన్ తదితర చట్టబద్ధ సౌకర్యాలు కల్పించాలన్నారు. కనీస వేతనాలు అన్ని రంగాల కార్మికులకు రూ.26000 ఇవ్వాలి అన్నారు.

రంగాపూర్ సమీపంలోని ఏబీడీ ఆల్కహాల్ కంపెనీలో పనిచేస్తున్న హమాలీలకు సంఘం రిజిస్ట్రేషన్ అయినప్పటికీ కంపెనీ పేరు మారడంతో జిల్లా కార్మిక శాఖ అధికారి పేరు మార్పిడికి అదే నెంబర్తో ఇవ్వాలని జిల్లా అధికారికి దరఖాస్తు చేసి ఏండ్లు గడుస్తున్న పేరు మార్చకుండా నిర్లక్ష్యం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. వెంటనే సర్టిఫికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏబీడీ కంపెనీలో పనిచేస్తున్న మహిళా కార్మికులకు కార్మిక చట్టాలు అమలు చేయకపోవడంతో కనీస సౌకర్యాలు కల్పించడం లేదని వెంటనే లేబర్ చట్టాలు అమలు చేయాలన్నారు. వలస కార్మికులకు అంతరాష్ట్ర చట్టాన్ని అమలు చేసి కార్మికులకు గుర్తింపు కార్డులు ఇచ్చి రక్షణ కల్పించాలన్నారు.

హమాలి, ట్రాన్స్పోర్ట్ వర్కర్స్, అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, గ్రామపంచాయతీ కార్మికులకు నెల నెల వేతనాలు ఇవ్వాలని, మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. బీడీ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేసి ప్రతి కార్మికుడికి జీవనభృతి ఇవ్వాలన్నారు. బిల్డింగ్ వర్కర్స్ అందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, సంక్షేమ పథకాలు సకాలంలో అందించాలని, కార్మిక సంఘాలతో అడ్వైజరీ కమిటీ వేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని, 60 సంవత్సరాలు దాటిన వారందరికీ ఆరువేల పెన్షన్ ఇవ్వాలని, పెండింగ్ క్లెయిమ్స్ ఇచ్చి ఏ ఎల్ వో ను నియమించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేశారు. మహాసభల్లో ప్రవేశపెట్టిన తీర్మానాల అమలు కోసం సిఐటియు పోరాటం చేస్తుందన్నారు. సమావేశంలో సిఐటియు జిల్లా కోశాధికారి బొబ్బిలి నిక్సన్, గౌరవ సలహాదారుడు జి బాలయ్య, కమిటీ సభ్యులు ఉషన్న, సహాయ కార్యదర్శి ఎస్ రాము తదితరులు పాల్గొన్నారు. 

సీఐటీయూ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక 

సీఐటీయూ వనపర్తి జిల్లా నాలుగో మహాసభల సందర్భంగా జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పుట్ట ఆంజనేయులు వెల్లడించారు. అధ్యక్షులుగా ఆర్ ఎన్ రమేష్, కార్యదర్శిగా మండ్ల రాజు, కోశాధికారిగా బొబ్బిలి నిక్సన్, ఉపాధ్యక్షులుగా ఎండి మహమూద్, పుట్ట ఆంజనేయులు, కే సునీత, జి శారద, ఎస్ రాజు, సహాయ కార్యదర్శులుగా గంధం మదన్, ఏ బుచ్చమ్మ, ఎస్ రాము, బి కవిత, ఏ బాల గౌడ్, కమిటీ సభ్యులుగా బాలరాజు, నాగేష్, డి కురుమయ్య, బుచ్చన్న, వెంకటేష్, జి జ్యోతి, నాగేంద్రమ్మ, వి వెంకటయ్య, లావణ్య, కురుమయ్య, శ్రీనివాసులు, పుష్ప, ఉషన్న, నందిమల్ల రాములు,  బాలు, వెంకట్ రెడ్డి, జానకి రాములు, ప్రభాకర్, వెంకటయ్య, నరసింహ, రాజు, అనీప్, ఆశన్న లను ఎన్నుకుంది అన్నారు. 13 మంది జిల్లా ఆఫీసు బేరర్స్ గా, 23 మంది జిల్లా కమిటీ మెంబర్స్ గా మొత్తం 36 మందితో నూతన కార్యవర్గం ఎన్నికైంది అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -