Saturday, July 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పులిగిల్ల టూ భువనగిరి బస్సును విద్యార్ధుల సమయానుకూలంగా నడపాలి..

పులిగిల్ల టూ భువనగిరి బస్సును విద్యార్ధుల సమయానుకూలంగా నడపాలి..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : పులిగిల్ల టూ భువనగిరి ఆర్టీసీ బస్సును విద్యార్థుల సమయానుకూలంగా నడపాలని బుధవారం యాదగిరిగుట్ట డిపో కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎన్ ఎస్ సి ఐ నాయకులు సురుపంగ చందు మాట్లాడుతూ పులిగిల్ల, వీరవెల్లి, బండసోమవారం, చందుపట్ల, రామచంద్రాపురం, పెంచికల్పహాడ్ గ్రామాల విద్యార్థులకు ఒకే ఒక ఆర్టీసీ బస్సు ఉండడమే కాకుండా అది కూడా ఉదయం సాయంత్రం విద్యార్థుల సమయానుకూలంగా రావడం లేదని అన్నారు. దీనితో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని తెలిపారు. విద్యార్థుల సమయానుసారం రవాణా సౌకర్యం కల్పించాలని,  మరొక ఆర్టీసీ బస్సును ఏర్పాటు చేయాలని డిపో మేనేజర్ ను కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉగ్గి దుర్గాప్రసాద్, సిరికొండ తేజ, కొండోజు రోహిత్, భాను, మణికంఠ, మహేష్ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -