Saturday, July 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ఆర్థిక అభివృద్ధి: ఎమ్మెల్యే

కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ఆర్థిక అభివృద్ధి: ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – వనపర్తి 
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తోనే ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని, నేడు గ్రామాలలో హామీల అమలుతో ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అన్నారు. ఖిల్లా గణపురం మండల కేంద్రంలో ఖిల్లగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో బుధవారం ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం వద్ద నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న అలనాటి వేణుగోపాల స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలోని పిఎసిఎస్ కార్యాల యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని అన్నదాతలకు మంజూరైన రాయితీ రుణాల కు సంబంధించిన పత్రాలను అందజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంల్లోకి వచ్చాక అన్నదాతలకు కావలసిన అన్ని రకాల పథకాలను అమలు చేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సింగిల్ విండో బ్యాంకుల నుంచి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గోల్డ్ లోన్, వ్యవసాయ రుణాలు, దీర్ఘకాలిక రుణాలను అందజేయాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షులు మురళీధర్ రెడ్డి, క్యామరాజు, వనపర్తి మండల మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, వెంకట్రావు, సాయిచరణ్ రెడ్డి, క్యామ వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు విజయ్ కుమార్, ఆగారం ప్రకాష్, గంజాయి రమేష్, మనాజిపేట సతీష్, సింగిల్ విండో డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అటవీశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -