Saturday, July 19, 2025
E-PAPER
Homeఆటలులక్ష్యసేన్‌ శుభారంభం

లక్ష్యసేన్‌ శుభారంభం

- Advertisement -

తొలిరౌండ్‌లోనే ఓడిన సింధు
టోక్యో:
జపాన్‌ ఓపెన్‌ సూపర్‌-750 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. మహిళల సింగిల్స్‌లో పివి సింధు తొలిరౌండ్‌లోనే ఓటమిపాలవ్వగా.. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌, డబుల్స్‌లో చిరాగ్‌శెట్టి-సాత్విక్‌ సాయిరాజ్‌ రెండోరౌండ్‌కు చేరారు. బుధవారం జరిగిన తొలిరౌండ్‌ పోటీలో రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత సింధు 15-21, 14-21తో కొరియాకు చెందిన సిమ్‌-యు-జిన్‌ చేతిలో వరుససెట్లలో ఓటమిపాలైంది. ఇక పురుషుల డబుల్స్‌లో 15వ ర్యాంక్‌ జోడీ చిరాగ్‌-సాత్విక్‌ 21-18, 21-10తో కేవలం 42 నిమిషాల్లోనే కొరియా జంటను చిత్తుచేసింది. ఇక పురుషుల సింగిల్స్‌లో 18వ సీడ్‌ లక్ష్యసేన్‌ 21-11, 21-18తో చైనాకు చెందిన జెంగ్‌ షింగ్‌పై పోరాడి విజయం సాధించి రెండోరౌండ్‌కు చేరాడు. రెండోరౌండ్‌లో చైనాకే చెందిన 7వ సీడ్‌ వాంగ్‌తో అమీ తుమీ తేల్చుకోనున్నాడు. ఇద్దరు భారత షట్లర్ల మధ్య జరిగిన మరో మ్యాచ్‌లో అనుపమ ఉపాధ్యాయ 21-15, 18-21, 21-18తో రష్మితను ఓడించి రెండోరౌండ్‌కు చేరారు. ఇక ఉన్నతి హుడా 8-21, 12-21తో థారులాండ్‌కు చెందిన 7వ సీడ్‌ ఛోఛువాంగ్‌ చేతిలో పరాజయాన్ని చవిచూసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -