Sunday, July 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టులు

బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టులు

- Advertisement -

నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల, ప్రతిపక్ష టిఆర్ఎస్ పార్టీ నాయకుల సవాళ్ల, ప్రతి సవాళ్ల మధ్య గురువారం చలో వేల్పూర్ కార్యక్రమానికి తరలి వెళ్లకుండా మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన టిఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా  అరెస్టులు చేశారు. మండలానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు గడ్డం స్వామి, ఇంద్రాల రాజు, కాలేజ్ శేఖర్, కొమ్ముల రాజేందర్, నవీన్ గౌడ్, పాలెపు రవి కిరణ్ తదితరులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి కమ్మర్ పల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ చలో వేల్పూర్ కార్యక్రమం అడ్డుకుంటున్న పోలీసులు అధికార కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తూ ప్రశ్నించే గొంతును నొక్కాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.గత రాత్రి నుంచి బిఆర్ఎస్ ముఖ్య నాయకుల ఇండ్ల వద్దకు వచ్చి నోటిసులు, హౌస్ అరెస్టులతో ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులను ఇబ్బందులకు గురి చేశారన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసులను అడ్డుపెట్టుకొని ఎన్ని రకాలుగా నిర్బంధాలు ప్రయోగించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి అండగా చలో వేల్పూర్ కార్యక్రమంలో పాల్గొనడానికి బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -