- Advertisement -
- – మహిళలే లక్ష్యంగా రుణాలు
- – గుట్టుగా వారం రికవరీలు..అడ్డగొలుగా వడ్డి వసూళ్లు
- – గడువు ముగిసిన యథేచ్ఛగా కార్యాకలపాలు
- నవతెలంగాణ-బెజ్జంకి
- గ్రామాల్లోకి మళ్లీ మైక్రో పైనాన్స్ విస్తరించింది. మండల కేంద్రంలో బార్గాచ్ పేరుతో మైక్రో పైనాన్స్ ఏర్పాటుచేసి ప్రజల అత్యవసరాలను ఆసరాగా చేసుకుని మహిళలే లక్ష్యంగా గుట్టుగా రుణాలను కట్టబెడుతున్నారని సమాచారం. వారం వారం ఏజెంట్లు రుణాలు తీసుకున్న మహిళల వద్దకు వెళ్లి అధిక వడ్డీలకు వసూళ్లు చేస్తున్నారు.సకాలంలో చెల్లించకపోతే అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణల వినిపిస్తున్నాయి. గతంలో మైక్రో పైనాన్స్ అధిక వడ్డిలకు పాల్పడడంతో రాష్ట్రంలో పలు కుటుంబాలు వీధిన పడిన సందర్భాలున్నాయి. దీంతో ప్రభుత్వం మైక్రో పైనాన్ఫ్ నిషేధించింది. మళ్లీ మండలంతో పాటు చుట్టూ సుమారు 20 కీ.మీ పరిధిలోని మండలేతర గ్రామాలకు విస్తరించి ఏజెంట్లు పైనాన్స్ కార్యకలాపాలు సాగిస్తున్నారు. మైక్రో పైనాన్స్ వల్ల మహిళలు ముందస్తుగా సమస్యలపాలవ్వకుండా అడ్డుకోవాలని అధికారులను పలువురు కోరారు.
- అనుమతి గడువు ముగిసినా..
- మండల కేంద్రంలో బార్గాచ్ పేర అవంతి మైక్రో పైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏజెంట్లు కార్యకలాపాలు సాగిస్తున్నారు.జూన్ 2025 వరకున్న సాదాన్ గడువు ముగిసిన యథేచ్ఛగా మైక్రో పైనాన్స్ కార్యాకలపాలు సాగిస్తుండడం విశేషం.
- Advertisement -