నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
జిల్లాలోని ఫిట్నెస్ లేకుండా బస్సులు నడుపుతున్న ప్రైవేట్ పాఠశాలల పై చర్యలు తీసుకోవాలని, ప్రైవేట్ పాఠశాలల్లో బస్సులలో విద్యార్థులను ఓవర్ లోడింగ్ తో బస్సులు నడుపుతున్న యజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డిటిఓ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతికుమార్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంతో పాటు మండలాలలో ఉన్న ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులను ఓవర్ లోడింగ్ తో పాఠశాలకు తరలిస్తూ ఒకరిపై ఒకరిని కూర్చోబెడుతూ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తూ హింసిస్తున్నారని అలాంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు మచ్చ సందీప్, వినయ్, చిప్పలపల్లి వంశీ లు పాల్గొన్నారు.
ఓవర్ లోడింగ్ తో బస్సులు నడుపుతున్న ప్రవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి: ఏఐఎస్ఎఫ్
- Advertisement -
- Advertisement -



