- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
మండలంలోని పొనకల్ గ్రామపంచాయతీ పరిధిలోని చెరుకు గూడెం గ్రామానికి చెందిన డోలి మల్లేష్ కుమార్తె డోలి సోని మాస్టర్స్ ఆఫ్ ఆర్ట్స్ తెలుగులో గోల్డ్ మెడల్ అందుకుంది. డిచ్ పెళ్లి తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకుంది. గోల్డ్ మెడల్ అందుకున్న డోలి సోని ని గ్రామస్తులతో పాటు పలువురు అభినందించారు.
- Advertisement -