న్యూఢిల్లీ : గురుగ్రామ్‌లో 2008లో జరిగిన ఒక భూ ఒప్పందానికి సంబంధిం చిన కేసులో వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఛార్జీషీట్ నమోదు చేసింది. ఈ విషయాన్ని ఇడి అధికారులు గురువారం వెల్లడించారు. మనీలాండరింగ్ చట్టం కింద వాద్రాపై అభియోగాలు మోపినట్టు తెలిపారు. ఏప్రిల్‌లో ఈ కేసు విషయంపై వాద్రాను వరసగా మూడు రోజులు పాటు ఈడీ విచారించింది. తరువాత వాద్రాపై ఇదే ఈడీ తొలి ఛార్జిషీట్. గురుగ్రామ్‌లోని షికోపూర్ ప్రాంతంలో ఉన్న 3.53 ఎకరాల భూ ఒప్పందంలో మనీలాండరింగ్ జరిగిందని ఇడి ఆరోపిస్తోంది. రూ. 7.5 కోట్ల విలువైన ఈ భూమిని కొనుగోలు చేసే సమయంలో కాంగ్రెస్ నాయకులు సోనియాగాంధీ అల్లుడైన వాద్రాకు చెందిన రెండు సంస్థల బ్యాంకు ఖాతాల్లో కేవలం రూ 2 లక్షలు మాత్రమే ఉన్నాయని ఈడీ అధికారులు చెప్పారు.
వాణిజ్య కార్య కలాపాల కోసం భూమిని అభివృద్ధి చేయడానికి వాద్రా సంస్థ దరఖాస్తు చేసుకోగా, హర్యానా ప్రభుత్వం కేవలం నాలుగు రోజుల్లోనే అనుమతి మంజూరు చేసిందని చెప్పారు. వాద్రాకు చెందిన స్కై లైట్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్‌ఎల్‌హెచ్‌పీఎల్) ప్రభుత్వానికి ఎటువంటి చెల్లింపు చేయకుండానే భూమిని కొనుగోలు చేసిందని, మరో సంస్థ స్కై లైట్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్‌ఎల్‌ఆర్‌పిఎల్) చెక్కు జారీ చేసినా ఈ చెక్కును నగదుగా మార్చడానికి బ్యాంక్‌కు ప్రభుత్వం ఎప్పుడూ సమర్పించలేదని ఈడీ అధికారులు ఆరోపించారు.
రాబర్ట్ వాద్రాపై ఈడీ ఛార్జిషీట్
- Advertisement -
- Advertisement -