2024-25 స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో పురస్కారం
వ్యర్థాల రహిత నగరం కేటగిరీలో 7 స్టార్ రేటింగ్
క్లీనెస్ట్ కంటోన్మెంట్ బోర్డుల్లో సికింద్రాబాద్‌కు తొలిస్థానం
న్యూఢిల్లీ: ‘వ్యర్థాల రహిత నగరం’ కేటగిరీలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ 7 స్టార్ రేటింగ్ సాధించింది. గతంలో 5 స్టార్ రేటింగ్ ఉండేది. 2024-25 సంవత్సరానికి గానూ ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో ప్రామిసింగ్ స్వచ్ఛ షహర్ నగరాల జాబితాలో తెలంగాణ నుంచి హైదరాబాద్‌కు చోటు దక్కింది. క్లీనెస్ట్ కంటోన్మెంట్ బోర్డ్ కింద ఇచ్చిన అవార్డుల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ తొలిస్థానాన్ని సొంతం చేసుకుంది.
ఎనిమిదోసారి ఇండోర్ సత్తా
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరం పరిశుభ్రతలో మరోసారి సత్తా చాటింది. దేశంలోనే అత్యంత పరిశుభ్ర నగరాల జాబితాలో తొలిస్థానం దక్కించుకుంది. 2024-25 సంవత్సరానికి గానూ ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో వరుసగా ఎనిమిదోసారి కైవసం చేసుకుంది. గుజరాత్‌లోని సూరత్ రెండో స్థానాన్ని దక్కించుకుంది. గత ఏడాది ఇండోర్‌తో పాటు సూరత్ కూడా సంయుక్తంగా తొలి ర్యాంక్‌లో నిలిచిన సంగతి తెలిసిందే. మూడో స్థానంలో నవీ ముంబయి నిలిచింది. ఇక, ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి విజయవాడ సత్తా చాటింది. ఈ జాబితాలో నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది.
ప్రామిసింగ్ స్వచ్ఛ షహర్ హైదరాబాద్
- Advertisement -
- Advertisement -