నాపై ఏదైనా డ్రగ్స్ కేసు నమోదైందా?
దాంతో నాకు సంబంధమున్నట్టు ఆధారాలున్నాయా?
దమ్ముంటే బయటపెట్టండి : కేటీఆర్
హైదరాబాద్: మీడియాతో చిట్‌చాట్ పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి తనపై అసత్య ఆరోపణలు చేశారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఢిల్లీలో సీఎం చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.”నాపై ఏదైనా డ్రగ్స్ కేసు నమోదైందా?దానితో నాకు సంబంధమున్నట్టు ఆధారాలున్నాయా?దమ్ముంటే బయటపెట్టాలని సీఎంను సవాల్ చేస్తున్నా. నేరుగా నా ముందు నిలబడే ధైర్యం లేక చిట్‌చాట్లు చేస్తున్నారు. ఇలా వ్యక్తిత్వ హననానికి పాల్పడటం సీఎంకు కొత్తకాదు. రేవంత్‌రెడ్డి.. మిమ్మల్ని కోర్టుకు లాగుతా. తప్పుడు ఆరోపణలకు మూల్యం చెల్లించుకోక తప్పదు. సీఎం క్షమాపణ చెప్పకపోతే పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది” అని కేటీఆర్ అన్నారు.
రేవంత్..మిమ్మల్ని కోర్టుకు లాగుతా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES