-జిల్లా గ్రంధాలయ చైర్మన్ కేడం లింగమూర్తి
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
భారతదేశంలో ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టి కరెన్సీని ప్రజలందరికీ అందుబాటులో తెచ్చిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని రూపాయి నోట్ల మీద రిజర్వ్ బ్యాంక్ ముద్రించాలని సిద్దిపేట జిల్లా గ్రంథాలయాల చైర్మన్ కేడం లింగమూర్తి డిమాండ్ చేశారు. శనివారం హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కరెన్సీ నోట్ల పై అంబేద్కర్ ఫోటో ముద్రణ చేయాలని ప్రముఖ ఉద్యమకారుడు జేరిపోతుల పరశురాం చేపట్టిన రథయాత్ర పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గ్రంధాలయ చైర్మన్ కేడం లింగమూర్తి మాట్లాడుతూ రిజర్వ్ బ్యాంకు వ్యవస్థాపకుడు, ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోను కరెన్సీ మీద ముద్రించడం సముచితమైన దేనని అన్నారు. జేరిపోతుల పరుశురాం చేపట్టిన ఈ ఉద్యమం చాలా గొప్పదని అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించి చిత్రపట ముద్రణ వెంటనే చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాధన సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జేరుపోతుల పరుశురాం, సిద్దిపేట జిల్లా ఇంచార్జ్ ముక్కెర సంపత్ కుమార్, అడ్వకేట్ చిత్తారి రవీందర్, నాయకులు మర్రి వెంకటస్వామి, కోమటి సత్యనారాయణ, కొడ ముంజ మహేందర్, వెన్న రాజు, గడిపే బాలు, కొలుగూరి అశోక్ తదితరులు పాల్గొన్నారు.
కరెన్సీపై అంబేద్కర్ బొమ్మను ముద్రించాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES