నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లారా గ్రామపంచాయతీ శివారు పరిధిలో 33/11 నూతనంగా నిర్మించిన సబ్ స్టేషన్ ను జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ నూతన సబ్స్టేషన్ ఏర్పాటుతో ఐదు గ్రామాలకు విద్యుత్ వినియోగం ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ సబ్ స్టేషన్ మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లారా, రాచూర్, జుక్కల్ మండలంలోని నాగాల్గం, బిచ్కుంద మండలంలోని రాజుల, కందార్ పల్లి, ఈ ఐదు గ్రామాలకు సబ్స్టేషన్ నుండి కరెంటు సరఫరా అవుతుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పెద్ద ఎక్లారా తాజా మాజీ సర్పంచ్ మద్నూర్ సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్, పెద్ద ఎక్లారా గ్రామ పెద్దలు హనుమంతరావు దేశాయ్, తదితరులతోపాటు మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయ స్వామి దేవాలయ ధర్మాదాయ శాఖ ఆలయ కమిటీ చైర్మన్ పటేల్, మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమాన్ స్వామి, విఠల్ గురూజీ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దరాస్ సాయిలు, మండలంలోని వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు మండల అధికారులు పాల్గొన్నారు.
సబ్ స్టేషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే తోట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES