Sunday, July 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అనుమతులు లేని ప్రయివేట్ పాఠశాలలకు చెక్ 

అనుమతులు లేని ప్రయివేట్ పాఠశాలలకు చెక్ 

- Advertisement -

మండల విద్యాశాఖ అధికారి రేగ కేశవరావు 
నవతెలంగాణ – తాడ్వాయి 

మండల కేంద్రంలో అనుమతి లేకుండా నడుస్తున్న సిఎస్ఐ పాఠశాలను శనివారం మండల విద్యాశాఖ అధికారి రేగ కేశవరావు, జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు ఆకస్మికంగా తనకి చేశారు. మండల కేంద్రంలో అనుమతి లేకుండా నడుస్తున్న సిఎస్ఐ పాఠశాలకు నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ రేగ కేశవరావు మాట్లాడుతూ.. ప్రయివేటు పాఠశాల నడవడాని ప్రభుత్వ విద్యాశాఖ నుండి అనుమతి తీసుకోవాలని లేకుంటే సీజ్ చేస్తామని హెచ్చరించారు. మీ పాఠశాలకు ప్రభుత్వ విద్యాశాఖ కార్యాలయం నుండి ఇలాంటి అనుమతులు లేనందున తొందరగా మూసివేయాలన్నారు. గతంలో రెండు సార్లు పాఠశాల మూసివేయాలని యాజమాన్యాన్ని హెచ్చరించినట్లు తెలిపారు. ప్రభుత్వం నుండి ఆదేశాలు, లైసెన్సు తెచ్చుకునే వరకు పాఠశాల ముసివేయాలని తెలిపారు. లేదంటే వెంటనే సీజ్ చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -