నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
జిల్లాలోని ఎస్సీ, ఎస్టి, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టల్లో గురుకుల పాఠశాలలో ఆశ్రమ పాఠశాలలలో మౌనిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి జగన్మోహన్ ప్రసాద్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని సంక్షేమ హాస్టల్లో గురుకుల పాఠశాలలలో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో సంక్షేమ హాస్టల్లో వార్డెన్లు అందుబాటులో ఉండకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, జిల్లాలోని గురుకుల పాఠశాలల కోసం సొంత భవనాలు నిర్మించి జిల్లాలో గురుకుల విద్యార్థుల మరణాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాలని అన్నారు. విద్యార్థులకు అందుబాటులో లేని వార్డెన్లను అధికారులను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు చిప్పలపల్లి బన్నీ, వంశీ లు పాల్గొన్నారు
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి: ఏఐఎస్ఎఫ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES