Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలోని శ్రీ విద్యా సాయి ఉన్నత పాఠశాల సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని హాస కొత్తూర్ గ్రామానికి చెందిన ఇరుగదిండ్ల శేఖర్ (27) ద్విచక్ర వాహనంపై కమ్మర్ పల్లికి వస్తుండగా శ్రీ విద్యా సాయి పాఠశాల సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై నుండి ఎగిరి బిటి రోడ్డుపై పడ్డ శేఖర్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ శేఖర్ ను 108 వాహనంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శేఖర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img