– దేశవ్యాప్తంగా 90వేలకు పైగా టెలికాం టవర్లు : కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్
– కంది ఐఐటీ హైదరాబాద్‌లో ఘనంగా స్నాతకోత్సవం
నవతెలంగాణ-కంది
దేశంలో 2027 వరకు ఊహించని విధంగా సరికొత్త టెక్నాలజీతో బుల్లెట్ ట్రైన్లు పట్టాలు ఎక్కనున్నట్టు కేంద్ర రైల్వే, కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. టెలికాం రంగంలో దేశం అగ్రగామిగా నిలిచేలా దేశవ్యాప్తంగా 90వేలకు పైగా టెలికాం టవర్లు ఏర్పాటు చేశామన్నారు. సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలోని ఐఐటీ హైదరాబాద్‌లో శనివారం 14వ స్నాతకోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. రైల్వే శాఖకు సంబంధించి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1300 పురాతన రైల్వే స్టేషన్లను కూల్చేసి వాటి స్థానంలో కొత్తవి నిర్మిస్తున్నామన్నారు. అందులో సికింద్రాబాద్, చర్లపల్లి స్టేషన్ ఉన్నాయన్నారు. 2047నాటికి ప్రపంచ పటంలో భారత్ ఒక కొత్త మార్పుతో అగ్రగామిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికి ప్రతి విద్యార్థీ తమ వంతు కృషి చేయాలని కోరారు. అనంతరం ఐఐటీ హైదరాబాదులో విద్యాభ్యాసం పూర్తి చేసిన 1250 మంది వివిధ శాఖల విద్యార్థులకు గ్రాడ్యుయేట్ పట్టాలు అందించారు. బీటెక్ సీఎస్సీలో విద్యార్థి రాహుల్ రామచంద్రన్‌కు బంగారు పతకం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, మెదక్ ఎంపీ రఘునందన్‌రావు, ఐఐటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్ బివి.మోహన్‌రెడ్డి, డైరెక్టర్ బిఎస్.మూర్తి, విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
2027 వరకు సరికొత్త టెక్నాలజీతో బుల్లెట్ ట్రైన్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES