- Advertisement -
– పాల్గొన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో శనివారం బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆషాఢ మాసం బోనాల వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ప్రథమ మహిళ సుధా దేవ్ వర్మ పాల్గొన్నారు. దేశాభివృద్ధి, తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం మహంకాళి దేవికి గవర్నర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలకు ఈ సందర్బంగా గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో గవర్నర్ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిషోర్, ఇతర సీనియర్ అధికారులు, రాజ్ భవన్ ఉద్యోగులు పాల్గొన్నారు.
- Advertisement -