Monday, July 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రకృతి యాత్ర...

వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రకృతి యాత్ర…

- Advertisement -

నవతెలంగాణ – అచ్చంపేట: నల్లమల్ల అడవి అమ్మవంటిదని, ప్రకృతితో మమేకం కావడంవల్ల అద్భుతమైన రోగ నిరోధక ప్రయోజనాలు లభిస్తాయని అచ్చంపేట వాకర్స్ అసోసియేషన్ ఫౌండర్ చందునాయక్, డిప్యూటీ తాసిల్దార్, ప్రధాన కార్యదర్శి రమేష్ లు అన్నారు. ఆదివారం వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మార్నింగ్ వాక్ లో భాగంగా అడవిలో మన్ననూర్ నుండి ఉమామహేశ్వరానికి నిర్వహించిన ట్రేక్కింగ్ ను ఫారెస్ట్ ఎడ్యుకేషన్ పబ్లిక్,  టూరిజం అధికారి శ్వేత ప్రారంభించారు. ట్రెక్కింగ్ వెళ్లే క్రమంలో పాటించాల్సిన నిబంధనలను వివరించారు. చందునాయక్, రమేష్ లు  మాట్లాడుతూ అడవితో  స్నేహితులతో కలిసి నడవడం ఒక ఆధ్యాత్మిక ప్రకృతి ప్రయాణంగా నిలిచిందని, మార్గమధ్యంలో పులి, చిరుతపులి అడుగులు, దారి వెంట అనేక పక్షులు కనిపించాయని అన్నారు. నడిచే క్రమంలో పకృతి ఆస్వాదిస్తూ అడుగులు వేసినట్లు తెలిపారు.

అటవీ శాఖ అధికారుల అనుమతి, పర్యవేక్షణలో  ట్రెక్కింగ్ యాత్ర సాగిందన్నారు. ప్రకృతిని ప్రేమించాలి, కాపాడాలి అనే స్పష్టమైన సందేశాన్ని ఈ యాత్ర తీసుకువచ్చిందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కోసం వాకింగ్, యోగ, ధ్యానంపై దృష్టి సారించాలని కోరారు.  కార్యక్రమంలో  ఎంపీడీవో రఘునందన్, హెచ్ఎం బిచ్చనాయక్, రిటైర్డ్ జిహెచ్ఎం నర్సోజి, రిటైర్డ్ జిల్లా మలేరియా అధికారి అశోక్ ప్రసాద్, నిరంజన్, రాములు, భాస్కర్, ఖదీర్, ఖాదర్, జమీర్, కాశిలింగం, ప్రమోద్, లక్ష్మీకాంత్, సాయిరాం, హరికృష్ణ, రమేష్, స్వామి, మాధవాచారి,  పుల్లయ్య, నరసింహ, శివశంకర్, హరి, శ్రీకాంత్, లక్ష్మణ్, హన్మ, ఖదీర్, ప్రకాష్, మల్లేష్, సాదిక్, సత్యం, క్రాంతి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -