Monday, July 21, 2025
E-PAPER
Homeదర్వాజసాహితీ స‌మాచారం

సాహితీ స‌మాచారం

- Advertisement -

‘రేపటి కాలం’ కవిత్వం ఆవిష్కరణ
కవిసంగమం, భాషా సాంస్కతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఎదిరెపల్లి కాశన్న రచించిన ‘రేపటి కాలం’ కవిత్వం ఆవిష్కరణ సభ 21 జులై ఉదయం 10 గంటలకు, రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరుగుతుంది. డా.కవియాకూబ్‌, గోరటి వెంకన్న, ప్రొఫెసర్‌ కాసిం, కటుకోజ్వల ఆనందాచారి, సామిడి జగన్‌ రెడ్డి, కోట్ల వెంకటేశ్వరరెడ్డి, తగుళ్ల గోపాల్‌, పుల్జాల గెలువయ్య, పి.వహీద్‌ ఖాన్‌, నాగవరం బాలరాం, కందికొండ మోహన్‌, కల్వకోల్‌ మద్దిలేటి, ముచ్చర్ల దినకర్‌, వనపట్ల సుబ్బయ్య, ఎదిరెపల్లి కాశన్న తదితరులు పాల్గొంటారు. వివరాలకు : ఎదిరెపల్లి కాశన్న, 919640006304

ఆచార్య వాసిరెడ్డి భాస్కరరావు స్మారక సాహిత్య పురస్కారం 2025 కై విమర్శా గ్రంథాలకు ఆహ్వానం
అరసం వరంగల్‌ వారు ఆచార్య వాసిరెడ్డి భాస్కరరావు స్మారక సాహిత్య పురస్కారం 2025 సంవత్సరంకు గాను సాహిత్య విమర్శకు గ్రంథాలను ఆహ్వానిస్తున్నారు. 2021 జులై నుండి 2025 జూన్‌ వరకు ప్రచురించిన మొదటి ముద్రణల నాలుగు ప్రతులు పంపాలి. ప్రతులను 31 ఆగస్టు లోపు బూర భిక్షపతి, ఇంటి నెంబర్‌, 2 – 12 – 293/20, రోడ్‌ నెంబర్‌ 2 బి, విజయనగర్‌ కాలని, గోపాలపురం రొడ్‌, హనమకొండ 506009 చిరునామాకు పంపాలి. వివరాలకు : 9866612712.

పాలపిట్ట తెలంగాణ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ
తెలంగాణ ఏర్పడి పుష్కర కాలమవుతున్న సందర్భంగా పాలపిట్ట తెలంగాణ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ సభ 26 జూలై 2025 శనివారం సాయంత్రం ఆరు గంటలకు రవీంద్ర భారతి సమావేశ మందిరంలో జరుగుతుంది. సభకు డాక్టర్‌ రూప్‌ కుమార్‌ డబ్బీకార్‌ అధ్యక్షత వహిస్తారు. డాక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డి ఆవిష్కరిస్తారు. సభలో నామోజు బాలాచారి, మామిడి హరికష్ణ, పొట్లపల్లి శ్రీనివాసరావు, ఎం. నారాయణశర్మ, గుడిపాటి , ఒద్దిరాజు ప్రవీణ్‌ కుమార్‌ప్రసంగిస్తారు.
– పాలపిట్ట బుక్స్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -