Monday, July 21, 2025
E-PAPER
Homeసినిమారాహుల్‌ సిప్లిగంజ్‌కు రూ.కోటి నజరానా

రాహుల్‌ సిప్లిగంజ్‌కు రూ.కోటి నజరానా

- Advertisement -

గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌కు తెలంగాణ ప్రభుత్వం రూ.కోటి నజరానా ప్రకటించింది. ఎన్నికల ముందు రాహుల్‌సిప్లిగంజ్‌కు రూ.10 లక్షల ఆర్థిక సాయం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అలాగే కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వస్తే రూ.కోటి ప్రోత్సాహకం అందిస్తామని చెప్పారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు పాత బస్తీ బోనాల సందర్భంగా ఆదివారం రూ.కోటి నజరానా ప్రకటించారు. స్వయం కృషితో ఎదిగిన రాహుల్‌ సిప్లిగంజ్‌ యువతకు ఆదర్శమని ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
ఓల్డ్‌ సిటీ నుంచి ఆస్కార్‌ వరకూ వెళ్ళిన కుర్రాడంటూ రాహుల్‌ను తెలంగాణ ‘గద్దర్‌’ ఫిల్మ్‌ అవార్డుల ప్రదానోత్సవ వేడుకలో సీఎం కొనియాడిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి రాహుల్‌కి గద్దర్‌ అవార్డు దక్కలేదని, అతడి ప్రతిభకి తగ్గ అవార్డుగానీ, మరో ప్రోత్సాహకంగానీ ఇవ్వాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకు సీఎం సూచించారు.
‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లోని ‘నాటు…నాటు’ పాటకు ప్రతిష్టాత్మక ఆస్కార్‌ పురస్కారం లభించింది. ఈ పాటను కాలభైరవతో కలిసి రాహుల్‌ సిప్లిగంజ్‌ పాడారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -