Thursday, May 1, 2025
Homeతాజా వార్తలుLRS గడువు మరో 3 రోజులు పొడిగింపు

LRS గడువు మరో 3 రోజులు పొడిగింపు

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్‌కు సంబంధించి తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ పథకాన్ని మరో మూడు 3 రోజులు పొడిగించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ సెక్రటరీ టీకే శ్రీదేవి బుధవారం రాత్రి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో అక్రమ ప్లాట్ల క్రమబద్ధీకరణను వేగవంతం చేసేందుకు సర్కార్ 25 శాతం డిస్కౌంట్‌తో వన్ టైమ్ సెటిల్‌మెంట్ పథకాన్ని తీసుకొచ్చింది.
అయితే, 2020లో అందుకు సంబంధించి మొత్తం 25,67,107 దరఖాస్తులు రాగా.. ఇప్పటి వరకు సుమారు 8 లక్షల అప్లికేషన్లను మాత్రమే అధికారులు క్లియర్ చేశారు. మిగిలిన వాటిని కూడా పరిష్కరించాలని ఉద్దేశంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో 25 శాతం రాయితీతో ప్రభుత్వం వన్‌టైమ్ సెటిల్‌మెంట్‌ను ప్రకటించింది. కానీ, అందుకు లాస్ట్ డేట్ గడువు మార్చి 31న ముగియగా.. దరఖాస్తుదారుల అభ్యర్థన మేరకు ఏప్రిల్‌ 30 వరకు పొడిగించారు. ఈ నేపథ్యంలోనే మరో మూడు రోజులు వన్ టైమ్ సెటిల్‌మెంట్‌ను పొడిగిస్తూ రాష్ట్ర పురపాలక, పట్టాణాభివృద్ది శాఖ సెక్రటరీ టీకే శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img