Tuesday, July 22, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్నేడు స్కూల్స్ , కాలేజీలు బంద్

నేడు స్కూల్స్ , కాలేజీలు బంద్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు సందర్భంగా ఈ నెల 21న అంటే ఇవాళ్టి రోజున పబ్లిక్ హాలిడే ప్రకటించారు. దింతో ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలతో పాటుగా ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవు ఉండబోతోంది. హైదరాబాద్, సికింద్రాబాద్ లాంటి జంట నగరాలలో సోమవారం లిక్కర్ షాపులు కూడా మూసివేస్తున్నారు. నిన్న ఆదివారం కావడంతో వరుసగా రెండు రోజులు హాలిడే వచ్చింది.

ఇప్పటికే గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ అత్యంత వైభవంగా జరుగుతోంది. ప్రతి ఒక్కరూ అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. అమ్మవారి మీద భక్తితో కట్నాలు, కానుకలు సమర్పించారు. కేవలం ఈ సెలవు తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉంటుంది. ఏపీలో సెలవు లేదు. ఏపీలో విద్యాసంస్థలు, ఆఫీసులు యధావిధిగా నడుస్తాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -