- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హనుమాన్ జంక్షన్ బైపాస్ రోడ్డులో బైక్‌ను వెనుక నుంచి లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు దేవరపల్లి గ్రామానికి చెందినవారిగా గుర్తింపు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -