- Advertisement -
నవతెలంగాణ – అశ్వారావుపేట : యూటీఎఫ్ జిల్లా నాయకులు ఎం.క్రిష్ణా రావు ను ఆదివారం అశ్వారావుపేట లో ఆయన గృహంలో సంఘం రాష్ట్ర అద్యక్షులు చావా రవి పరామర్శించారు. క్రిష్ణా రావు తండ్రి నాగేశ్వరరావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో యూటీఎఫ్ నాయకత్వ క్రిష్ణా రావును కలిసి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బి.రాజు,జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు,జిల్లా కార్యదర్శులు డి.తావుర్యా,ఎస్కే.పాషా,నవతెలంగాణ విలేకరి మడిపల్లి వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.
- Advertisement -