– ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
నవతెలంగాణ – మద్నూర్
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన తెలంగాణ ఉద్యమకారులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ తో మంగళవారం రాష్ట్ర రాజధాని హైదరాబాదులో గన్ పార్కులో చేపట్టే ఆందోళన కార్యక్రమానికి మద్నూర్ మండలం నుండి తెలంగాణ ఉద్యమకారులు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా మండల తెలంగాణ ఉద్యమకారుల అధ్యక్షులు తూమ్ వార్ హనుమాన్లు మాట్లాడుతూ.. ఉద్యమకారుల డిమాండ్లను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గన్ పార్క్ బయలుదేరిన వారిలో తెలంగాణ ఉద్యమకారులు మాలే శివరాం, పైడాకుల అంజయ్య, వట్నాల గంగారం, రాచూర్ సుభాష్, పెద్ద తడగూర్ మొగులాజీ, పాకల విట్టల్, ఉన్నారు.
చలో గన్ పార్క్ బయలుదేరిన తెలంగాణ ఉద్యమకారులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES