Wednesday, July 23, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅచ్యుతానందన్‌ జీవితం స్ఫూర్తిదాయకం

అచ్యుతానందన్‌ జీవితం స్ఫూర్తిదాయకం

- Advertisement -

– సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ మాజీసభ్యులు చెరుపల్లి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

కేరళ మాజీ ముఖ్యమంత్రి, కమ్యూనిస్టు యోధుడు వీఎస్‌ అచ్యుతానందన్‌ మరణం పట్ల సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ మాజీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు సంతాపం తెలిపారు. ఆయన, తాను ఒకే సమయంలో కేంద్ర కమిటీలో పనిచేసే అవకాశం వచ్చిందని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన ఒక కార్యదక్షుడని తెలిపారు. 2006 నుంచి 2011 వరకు ఆయన కేరళ ముఖ్యమంత్రిగా పనిచేసినపుడు ప్రజల కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని గుర్తు చేశారు. కేరళను అన్ని రంగాల్లో ప్రగతిపథంలో ముందుకు నడిపారని వివరించారు. ఆదర్శంగా జీవించారని తెలిపారు. అచ్యుతానందన్‌ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -