Thursday, July 24, 2025
E-PAPER
Homeబీజినెస్ఐదు రాష్ట్రాల్లోనే 50 శాతం జీఎస్టీ చెల్లింపుదారులు

ఐదు రాష్ట్రాల్లోనే 50 శాతం జీఎస్టీ చెల్లింపుదారులు

- Advertisement -

న్యూఢిల్లీ : వస్తు సేవల పన్ను (జీఎస్టీ) చెల్లింపుదారుల్లో దాదాపు 50 శాతం మంది వరకు ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నారని ఎస్‌బిఐ రీసెర్చ్‌ ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. జీఎస్టీ అమలులోకి వచ్చి ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎస్బీఐ రీసెర్చ్‌ ఓ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఉత్తర్‌ ప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుంచే సుమారు 50 శాతం పన్ను చెల్లింపుదారులు ఉన్నారని తెలిపింది. యూపీ 13.2 శాతం పన్ను చెల్లింపుదారులతో టాప్‌లో ఉంది. ఆ తర్వాత స్థానంలో మహారాష్ట్ర (12.1 శాతం), గుజరాత్‌ (8.4 శాతం), తమిళనాడు (7.7 శాతం), కర్నాటక (6.9 శాతం) ఉన్నాయి. బీహార్‌ పన్ను చెల్లింపుదారుల వాటా 4.3 శాతంగా ఉండగా.. జిఎస్‌టి వసూళ్లలో మాత్రం 2.8 శాతం వాటానే కలిగి ఉంది. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక వంటి రాష్ట్రాలు జీఎస్టీ వసూళ్లలో ముందున్నప్పటికీ.. జీఎస్టీ చెల్లింపుదారుల సంఖ్య తక్కువగా ఉంది. ఉత్తరాఖండ్‌, ఛత్తీస్‌గడ్‌, జమ్మూ, అండ్‌ కాశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ వంటి రాష్ట్రాలు మొత్తం పన్ను చెల్లింపుదారుల సంఖ్యలో 1.4 శాతం లేదా అంతకంటే తక్కువ వాటాను కలిగి ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -