Sunday, July 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఊరూరా కొత్త రేషన్ కార్డుల పంపిణీ..

ఊరూరా కొత్త రేషన్ కార్డుల పంపిణీ..

- Advertisement -

నిరుపేదల్లో ఉత్సాహం..
అర్హులైన పేదలకు ఆహార భద్రత కార్డులు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
నవతెలంగాణ – మద్నూర్

రాష్ట్రంలో కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఊరూరా కొత్త రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రేషన్ కార్డులు మంజూరైన నిరుపేదల్లో ఆనందం ఉత్సాహం వ్యక్తం అవుతుంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. అర్హులైన పేదలకు ఆహార భద్రత కార్డులు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. శనివారం మద్నూర్ మండలంలోని చిన్న తడగూర్ పెద్ద తడుగూర్ అంతాపూర్ తదితర గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ నాయకులు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దరాస్ సాయిలు, పెద్ద తడగూర్ గ్రామ మాజీ ఎంపిటిసి మాజీ సర్పంచ్ కొండ గంగాధర్, ఆ గ్రామ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు గ్రామ అధ్యక్షులు ఈరన్న, కొండ రాజు, సలాబత్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ రామ్ పటేల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమాన్లు స్వామి, విట్టల్ గురూజీ, ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు రేషన్ కార్డు లబ్ధిదారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -