నవతెలంగాణ – భీంగల్
భీంగల్ పట్టణంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో పరిశుభ్రతను పెంపొందించాలని ఎన్ ఎస్ యు ఐ జిల్లా ఉపాధ్యక్షుడు సయ్యద్ రెహమాన్ భీంగల్ మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రన్ని అందజేశారు.ఈ సందర్భంగా రెహమాన్ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నాచు పేరుకుపోయి విద్యార్థులకు ఇబ్బందిగా మారుతోందని విద్యార్థులు రాకపోకలు సాగించే క్రమంలో జారి పడిపోయి గాయాల పాలవుతున్నారని మునిసిపల్ సిబ్బందితో తక్షణమే నాచును తొలగించాలని అలాగే వర్షాకాలం కావడంతో కళాశాల ఆవరణలు పిచ్చి మొక్కలు ముళ్ళ పొదలు విపరీతంగా పెరిగి పాములు తేళ్లు వంటి విష ప్రాణులకు ఆవాసంగా మారాయి వాటి వల్ల విద్యార్థులకు ప్రమాదం పొంచి ఉన్నందున పాఠశాల ఆవరణలో గల పిచ్చి మొక్కలను ముళ్లపదలను తొలగించి బ్లీచింగ్ పౌడర్ ను కళాశాల ఆవరణలో చల్లించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ని కోరడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ నాయకులు ప్రభాస్, కైఫ్ ,రంజిత్, హర్షిత్ ,రెహాన్ ,సుఫేన్, ఫర్హాన్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES