నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని మధ్యతరగతి ప్రాజెక్ట్ అయిన కౌలాస్ నాళా ప్రాజెక్ట్ నీటిమట్టం ఇన్ ఫ్లో ఎగువ ప్రాంతం నుండి రాకపోవడంతో నిరాశజనకంగా మారింది. సకాలంలో వర్షాలు రాక పోవడంతో ప్రాజెక్టు వెలవెలబోతోంది. ఈ ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియా మొత్తం మహారాష్ట్రలోని ఏడూరు గ్రామం ప్రాంతం నుండి దిగువకు ఇన్ఫ్లోవచ్చే విధంగా ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాజెక్టుకు డిజైన్ చేశారు. ఉమ్మడి మరో ఏపీ సీఎం వైఎస్ఆర్ ఉన్నప్పుడు మహారాష్ట్రలోని ఏడూరు గ్రామం వద్ద ఉన్న క్యాచ్ మెంట్ ఏరియా వద్ద దిగువకు నీరు రాకుండా అడ్డుకట్ట వేసి నిర్మాణాలు చేశారు. భారీగా నీటిని దిగువకు రాకుండా మహారాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేసి అక్రమ నిర్మాణాలు చేశారు.
కేంద్ర జలశాఖకు అప్పటి ప్రభుత్వం పలుమార్లు సిడబ్ల్యుసికి నీటి సమస్య గురించి విన్నవించినా పట్టించుకోకపోవడంతో అక్రమ అడ్డుకట్ట తొలగించక లేకపోయారు. దిగువన ఉన్న కౌలాస్ నాళాకు నీరు రాకుండా పోయింది. అప్పటినుండి ప్రాజెక్టు నీరు రాక కళావిహీనంగా తయారైంది. ఇరిగేషన్ శాఖ లెక్కల ప్రకారం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లు ఉంది. ప్రస్తుతము 455.10 మీటరు వద్ద కొనసాగుతోంది. కెపాసిటీ 0.635 టీఎంసీ / 1.237 టీఎంసీ ఉంది. ఇన్ ప్లో 92 క్యూసెక్కులు. కొత్తగా నీరు ఇటీవలే ఒకరోజు క్రితం వచ్చి చేరిందని ప్రాజెక్టు ఏఈ రవిశంకర్ తెలిపారు. అవుట్ ఫ్లో గేటు ద్వారా, కెనాల్ ద్వారా నీటి విడుదల నిల్ గా ఉంది . టోటల్ అవుట్ ఫ్లో నిల్ అని ఏఈ తెలిపారు.
నిరాశాజనకంగా కౌలాస్ నాళా ప్రాజెక్ట్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES