Thursday, July 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యూరియాను మోతాదుకు మించి వాడొద్దు: ఏఓ

యూరియాను మోతాదుకు మించి వాడొద్దు: ఏఓ

- Advertisement -

నవతెలంగాణ – దుబ్బాక 
అర లీటర్ నానో యూరియా లిక్విడ్.. ఒక యూరియా బస్తా కు సమానమని, ఈ నానో యూరియా లిక్విడ్ లో వేరే ఇతర పురుగుల మందు (పెస్టిసైడ్స్) ను కలిపి పంటకు పిచికారి చేయవచ్చని ఏవో (మండల వ్యవసాయ అధికారి) ఎం.ప్రవీణ్ కుమార్ అన్నారు. యూరియాను, పెస్టిసైడ్స్ ను మోతాదుకు మించి వాడడం వల్ల భూసారం తగ్గడమే కాకుండా వాయు కాలుష్యం పెరుగుతుందని, తద్వారా పలు రకాల క్యాన్సర్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

మంగళవారం దుబ్బాక మండలం పెద్ద చీకోడ్, మున్సిపల్ పరిధిలోని చెల్లాపూర్ వార్డులోని రైతు వేదికల్లో ఇఫ్కో, వ్యవసాయ శాఖ సంయుక్తంగా ‘ నానో యూరియా లిక్విడ్ వినియోగం’ పై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులు యూరియా బస్తాల పై ఆధారపడకుండా నానో యూరియా లిక్విడ్ మందును పిచికారి చేసుకోవాలని, మరిన్ని వివరాలకు ఏఈఓ లను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇఫ్కో ప్రతినిధి పృథ్వీరాజ్, ఏఈఓ లు సంతోష్, కవిత పలువురు రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -