”నాకొక గర్జించే గొంతుకనివ్వు దానితో ఈ నరమాంస భక్షకులను శపిస్తాను.వారి భయంకరమైన ఆకలి, మహిళలను కానీ పిల్లలను కానీ వదలడం లేదు” -రవీంద్రనాథ్ ఠాగూర్
గాజాలో నరమాంస భక్షకుల ఆకలి తీరడం లేదు. అవిశ్రాంతంగా భక్షిస్తూనే ఉన్నారు. రక్తదాహానికి కూడా అంతులేదు. ముందెన్నడూ లేని క్రూరత్వం, అమాను షత్వం విచ్చలవిడిగా జరుగుతున్నాయి. మరింత అనాగరికంగా కొనసాగుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఎన్నడూ ఎక్కడా విననంత, చూడనంతగా న్యూరమ్‌బర్గ్‌లో జరిగిన దుర్మార్గాలకు సాటిలేవు. అవెంతో వికృతంగా సాగిపోతున్నాయి. గాజా ప్రజల బాధలు వర్ణింప వీలుకానివి, అధిగమించలేనివి. అవి వింటే ఠాగూర్ గొప్పగా చేసిన గర్జన అరణ్యరోదనలాగా అనిపిస్తుంది.
మత్తుమందు లేకుండా శస్త్రచికిత్సలు లేదా అవయవాలు తొలగించడంవల్ల రక్తంతో తడిసిన నేలపై కిక్కిరిసిపోయిన పిల్లలు అరు పులు విన్నవారి హృదయాలు ద్రవించిపోతాయి. అలా చలించని వారిని కర్కశ హృదయులైన రాక్షసులు అనుకోవచ్చు.వికలాంగులకు కాళ్లు చేతులు కోల్పోయిన వారికి చక్రాల కుర్చీలు కల్పించడం లేదు. సహాయపడే పరికరాలు కానీ, సంరక్షకులను కానీ అనుమతించడం లేదు. వారు బాంబుదాడులు జరుగుతున్న ఒకప్రాంతం నుండి మరొక ప్రాంతానికి నడిచే వెళ్లవలసిన పరిస్థితి. అక్కడి హింసకు కాళ్లు చేతులు పోగొట్టుకొని చాలామంది పాకుతూ శరీరాన్ని తమకుతాము ఈడ్చుకుంటూ కదులుతున్నారు. ఇజ్రాయిల్ రక్షణదళాల మార్గంలోని ఇండ్లు, ఆసుపత్రులు, పునరావాస కేంద్రాలన్నీ శిధిలమై దారుణ పరిస్థితులు నెలకొన్నాయి.
ఇదంతా అనుబంధంగా జరిగిన నష్టంకాదు, లేక కొనసాగింపుగా జరిగింది కాదు.ఒక పథకం ప్రకారంగా ఉద్దేశపూర్వకంగా క్రమబద్ధంగా సృష్టించిన వైకల్యం.ఆగష్టు 2025న జరగబోయే తీర్పులో ఐక్యరాజ్యసమితి వికలాంగుల హక్కుల కమిటీకి సమర్పించబోయే ఒక పదునైన బలమైన విన్నపంలో దీన్ని ఒక సామూహిక వైకల్యత ఉత్పత్తిగా పేర్కొనడం జరుగుతుంది.అనేక ప్రపంచ సంస్థలు ఇంకా భారత జాతీయ వికలాంగుల హక్కుల వేదిక ఆమోదించిన అంతర్జాతీయ మహిళా సమస్త సమర్పించిన నివేదికలో కింది విధంగా భయంకరమైన వాస్తవాలు పొందుపరిచారు.
”కొన్నివేల మంది కొత్తగా అవయవాలు తొలగించబడి బాధాకరమైన శారీరక గాయాలతో మానసికమైన గాయాలతో వికలాంగులుగా చేయబడటమే కాక వారికి అత్యవసరమైన వైద్య సహాయం కూడా నిరాకరించబడింది”
యూనిసెఫ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ-2025 ప్రారంభంలో ఇచ్చిన తాజా సమాచారం ప్రకారం చూస్తే 7 అక్టోబర్ 2023 నుండి 3105 నుంచి4050 మధ్యన అవయవాలు తొలగించారు.వీరిలో 25 శాతం మంది పిల్లలు. అంటే దాదాపు 780 నుండి 1000 మంది పిల్లలు ఏదో ఒక అవయవం కోల్పోయిన వారే. అంతర్జాతీయ మానవతా వ్యవహారాల సమన్వయ కార్యాలయం, ఐర్లాండ్ క్రైస్తవ సహాయ సంస్థ ఇచ్చిన మే 2025 నివేదికలో 4700 మందికి అవయవాలు తొలగింపబడినట్లు, అందులో 850 మంది పిల్లలని పేర్కొన్నది. బాంబులు శరీరాలను గాజా ప్రజలను వైకల్యం చేస్తున్నాయి. ఇజ్రాయిల్ సైన్యాలు వారిని ముట్టడించి వైద్యమందనీ యడం లేదు. గాయాలు శరీరాన్ని శుష్కింపజేస్తున్నాయి. వైకల్యమనేది ఇంతకుముందు చూడని విషాదం కాదు. అది కావాలని ఉద్దేశపూర్వకంగా చేసిన అకృత్యాల ఫలితం ఇది. మారణహోమపు ఆయుధశాలలో ఇది ఒక ఆయుధం.
మారణహోమంలో పురాతన ప్రక్రియ – వికలాంగులే లక్ష్యంగా
గాజాలో నేడు బయటపడ్డది విషాదం కొత్తది కాదు, మొదటిది కాదు. భయంకరమైన చారిత్రక వారసత్వంలో ఇది ఒక భాగం. 1994లో రువాండాలో వైకల్యంగల వ్యక్తులను చర్చిల్లో బంధించి సజీవంగా దహనం చేశారు. శ్రబ్రేనికాలో (బోస్నియా 1995లో) పెద్దవారిని విక లాంగులను చావుకే విడిచిపెట్టారు. అన్నింటిలో అత్యంత క్రూరమైనది నాజీ జర్మన్‌కాలంలో జరిగింది. వికలాంగులను మొట్టమొదటగా చంపారు. వారిని వర్ణ వివక్ష, పరిశుభ్రత అనే కారణంగా లక్ష్యంగా చేసుకుని తుద ముట్టించారు. రెండు లక్షల మంది వికలాంగులను పూర్తిగా తుడిచిపెట్టారు. ఇది 1939లో నాజీల దుర్మార్గపు బీభత్సానికి ఒక నాందిగా మొదలుపెట్టారు. నాజీల వర్ణశుద్ధి ప్రచారంలో ఇది మొదటి ఘట్టం. వికలాంగులందరినీ జీవించటానికి అనర్హులుగా పరిగణిస్తూ భూమికి భారంగా భావించి వారి అందరిని గ్యాస్ గదుల్లోనికి పంపేవారు. ఇది సామూహిక యూదుల, ఇతర అయోగ్యుల అవాంఛనీయుల వధ కంటే ముందుగా చేశారు.
కమిటీ సమర్పించే వినతిలో భయానక దృశ్యాలు విస్తుపోయే విషయాలు మాట ల్లో చెప్పలేనివి: మహిళలు ప్రసవించాలి కానీ మత్తుమందు లేకుండానే డాక్టర్లు కేవలం సెల్ ఫోన్ లైట్లలోనే శస్త్ర చికిత్సలు నిర్వహించాలి తల్లులకు ఆహారం లేదు. కాబట్టి వారు తమ పిల్లలకు పాలు ఇవ్వలేరు. పుట్టిన బిడ్డలు ఎదగకుండానే మరణిస్తారు. ఎందుకంటే ఇంక్యుబేటర్లకు ఇంధనం సరఫరా లేదు. ముఖ్యంగా వైకల్య ంతో కూడిన మహిళలకు ఈ నరకం రెట్టింపు అవుతుంది. వారు పారిపోలేరు. మరుగు లేదా గోప్యత దూరమయ్యారు. వారిపై లైంగిక దాడులు హింస మరింత పెరిగే అవకాశం ఉంది. సంతానోత్పత్తికి సంబంధించిన జాగ్రత్తకు వారు నోచుకోలేదు. అది వారి బాధను మరింత పెంచింది.పాలస్తీనా స్త్రీవాద సంఘం దీన్ని పునరుత్పాదక నరమేధంగా వర్ణించింది.
గాజాలో మానసిక ఆరోగ్యం
ఉపశమనం లేని గాయాలు నిరంతరమైన ముట్టడిలో ఉండడంతో గాజా ప్రజల మానసిక పరిస్థితి పూర్తిగా కుప్పకూలింది. కొన సాగుతున్న బాంబు దాడులు తమవారిని, కుటుంబ సభ్యులను కోల్పోవడం చెప్పలేని ఘోరాలు. ఇవన్నీ గాజన్లను మరింత సామూహిక భయో త్పాతానికి, మానసిక వేదనకు గురి చేస్తున్నాయి. పిల్లలు పెద్దలు కూడా ఈ దుర్మార్గపు పీడ కలలను తలచుకుని పగటిపూట కూడా రోదిస్తున్నారు. దీనికి అంతులేదు. తల్లిదండ్రులు బాధను భరిస్తూ మౌనంగా శోకిస్తున్నారు. ఆసుపత్రులను నాశనం చేయడం, మానసిక ఆరోగ్య నిపుణుల కొరత లాంటివి గాజన్ల మానసిక గాయాలకు చికిత్స లేకుండా చేస్తున్నాయి. తద్వారా వారు ఇంకా నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు.అనుక్షణం ఏమవుతుందోనన్న ఆందోళన, నిరాశ, క్షతగాత్రులైన తర్వాత ఉండే మానసిక రుగ్మత వారిని ఆవహించి మరింత కుంగదీస్తున్నది. అయినా వారు కోలుకోవడానికి ఒక సురక్షిత స్థావరం లేదు. క్షతగాత్రులు కావడం అనేది ఇక్కడ తాత్కాలికం కాదు. అది నిరంతరం జరిగే ప్రక్రియ అవిచ్ఛిన్నంగా ఒక తరం నుండి మరో తరానికి చేరుకుంటున్నది.
మృతదేహాలతో కూడా లాభం
ఏఐ జజీరా నివేదిక 24 జులై 2025 ప్రకారం ఇజ్రాయిల్ దాడుల్లో 59వేల మంది పాలస్తినా పౌరులు చనిపోగా 13వేల మంది గాయాల బారిన పడ్డారు. హార్వర్డ్ లెక్కల ప్రకారం మూడు లక్షల 3,77,000 మంది మాయమై పోయారు. శిధిలాల కింద పూడ్చిపెట్టబడ్డారు. లెక్కకు అందకుండా పోయారు. వీరిలో తప్పించుకోలేక చావుకి నిరీక్షిస్తున్న అనేకమంది వికలాంగులున్నారు. ‘ఇజ్రాయిల్ చర్యల మూలంగా కచ్చితమైన, ఎప్పటికప్పుడు తాజా సమాచారం లేదా సంఖ్యను పొందడం చాలా కష్టం’ అని కమిటీ తన వినతిలో హెచ్చరించింది. సంఖ్య లేదా సమాచారం నిర్మూలన కూడా ఇజ్రాయిల్‌కు ఒక ఆయుధమే! గాజాపై ఇజ్రాయిల్ బాంబు దాడులకు పాల్పడం ద్వారా దాన్ని కృత్రిమ మేధా నియంత్రిత ఆయుధాలను పరీక్షించడానికి, సాంకేతికతను దాడులు నియంత్రణ ఉపకరణాలను పరీక్షించే వ్యవస్థగా ఉపయోగించుకున్నది. ఈ విజ్ఞానాన్ని భారత్‌తో సహా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నది. కమిటీ సమర్పణ ఈ విధంగా ఉంది. ‘యుద్ధం నిఘా సైనికవాదం లాభం పొందుతు న్నాయి మనుషులను సమూ హాలను నాశనం చేయడం ద్వారా..వైకల్యం కల్పించిన ఖైదీలపై రకరకాల ప్రయోగాలు చేసిన నాటి నాజీ డాక్టర్ల నుండి నేడు ఆధునిక ఆయుధాల ఉత్పత్తిదారుల వరకు యుద్ధ పరీక్షిత ఆయుధాల గురించి గొప్పగా చెప్పుకోవడం మారణహోమం పెట్టుబడి దారీతనం ఇవన్నీ కలిసే ప్రయాణం చేశాయి.
వికలాంగ వ్యక్తుల హక్కుల కమిటీని ఇజ్రాయిల్ ధృవపరిచింది.ఆ రకంగా సంఘర్షణలో ఉన్న వికలాంగులను సంరక్షించే బాధ్యతకు తానే కట్టుబడి ఉంది. నాలుగవ జెనీవా సమావేశం పౌరులకు వైద్య సహాయం సంరక్షణను గట్టిగా కోరింది. అయినప్పటికీ ఆస్పత్రులపై బాం బులు దాడి జరిగింది, సహాయం నిలిపివేయబడింది. వికలాంగులకు సేవలను పూర్తిగా దూరం చేశారు. కమిటీ తీర్మానాలకు డిమాండ్లకు కట్టు బడకుండా పోవడం ద్వారా అంతర్జాతీయ న్యాయసూత్రాలను ధిక్కరించిన ఫలితంగా స్వతంత్ర విచారణ జవాబుదారీతనం ఎదుర్కోవాల్సిన పరిస్థితిని కమిటీ హెచ్చరించింది. అయినా బాంబుల వర్షం కురుస్తూనే ఉంది. నిష్పత్తి, సహేతుకత లాంటి పదాలు ప్రచార మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి.
ఇంకా ఎంతమందిని?
గాజాలో పిల్లలు మేల్కొనే సమయానికి అవయవాలు కోల్పోయినట్లు గ్రహిస్తారు. తల్లులు తమకు అప్పుడే జన్మించిన ఇంకా జన్మించాల్సిన శిశువులను పూడ్చివేస్తారు. ఒకప్పుడు ఇల్లు పునరావాస కేంద్రాలు ఉన్నచోట నేడు అవి కనుమరుగై వ్యర్థ ప్రదేశాలుగా ఉండగా వికలాంగ స్త్రీలు అక్కడ పాకుతూ ఉంటారు. యాక్షన్ టి4 నుండి శ్రెబ్రెనిక వరకు రువాండా నుండి గాజా వరకు కొన్ని ప్రాణాలను వృధాగా ఉపయోగపడనివిగా నిర్ధారిస్తూ నరమేధం మొదలవు తుంది. వైకల్యంతో కూడిన వ్యక్తులు నిష్పత్తి కన్నా ఎక్కువగా అసమా నంగా, అసమంజసంగా హింసకు ప్రభావితం అవుతున్నారు. వారు రక్షణకు, గుర్తింపునకు దూరంగా ఉంచబడుతున్నారు.ఇంకా ఎన్ని అవయవాలు, పిండాలు, ప్రాణాలు ఈ రకంగా నా శనం కాబోతు న్నాయి? నాగరిక సమాజం అని ప్రశ్నించాల్సిన సమయం ఇది.
భారత వైక్యల్య ఉద్యమ సంస్థల మౌనం
గాజాలో పాలసీనియన్లను ముందు ఎన్నడూ లేని విధంగా వైకల్యానికి గురిచేసి హింసించడంపై భారత వైకల్య ఉద్యమ సంస్థ చాలా ఆశ్చర్యకరంగా ప్రస్ఫుటంగా మౌనం వహిస్తున్నది. ఒక పక్క ప్రపంచ వైకల్యత సంస్థలు ఇజ్రాయిల్ ఉద్దేశపూర్వకంగా విచ్చలవిడిగా వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని వికలాంగులుగా చేయడానికి ఖండించడమేకాక, కాల్పుల విరమణకు కూడా పిలుపునివ్వగా భారత వికలాంగుల సంస్థలు
తమకేమీ పట్టనట్లు ప్రవర్తించడం దారుణం. నిశ్శబ్దం చాలా భయంకరమైనది, కలవరపెట్టేది. అది వికలాంగ హక్కుల ఉద్యమం ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘించడం ద్రోహానికి పాల్పడినట్లే. ముఖ్యంగా ప్రాణంతో ఉన్న వారి క్రమానుగతాన్ని నిలబెట్టాలన్న నియమంపై ఆధారపడటమే కాక భారతదేశం తన మౌనం ద్వారా ఇజ్రాయిల్‌కు అండగా నిలవడం. చాలామంది నిస్సందేహంగా నిస్సిగ్గుగా నూతన సరళీకరణ మార్గానికి మద్దతుగా నిలిచి రాజీపడ్డారు. కానీ వికలాంగ సమూహం రాజ్యహింసకు, తమ వెలివేతకు వ్యతిరేకంగా చారిత్రాత్మకంగా నిలబడి ఏకైక కష్టా లను ఇబ్బందులను ఎదుర్కొంటున్నది.అంతేకాక గాజాలో సామూహికంగా వికలాంగులు తయారీని నిరోధించక, పిల్లలు బాంబుల దాడిలో అవయవాలు కోల్పోవడం, వారికి సహాయ పరికరాల నిరాకరణ, నిరాహారాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించడం వీటివల్ల ఉద్యమం ప్రపంచ వైకల్యత న్యాయానికి దూరమైంది. ఆ విధంగా చేసి అసమానంగా జరుగుతున్న వైకల్యపు ప్రాణుల లెక్కలను తెలియకుండానే ధ్రువీకరించి నట్లయింది. పాలసీనియన్లకు వికలాంగులకు లేదా మిగిలిన వారికి సంఘీభావం ఒక ఎండమావిలాగే ఉంది. ఈరకమైన వివక్షతో కూడిన, సానుభూతితో కూడిన సంఘీభావం, దాని విశ్వసనీయతను, ఆత్మను అణచివేసింది. అది పాటించిన ఈ మౌనం కూడా ఒక రకమైన హింసకు రూపమే కాక నరమేధంలో అదొక సంక్లిష్టమైన విధానంగా పేర్కొనవచ్చు.
అనువాదం: శ్రీశ్రీ కుమార్
మురళీధరన్
9868768543
ఇజ్రాయిల్ నరమేధంలో కొత్త ఆయుధాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES