- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
రాష్ట్రంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందించడమే లక్ష్యమని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ అన్నారు. డోంగ్లి మండలంలోని మొఘ గ్రామం లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కొత్త రేషన్ కార్డు స్లిప్పులు పంపిణి కార్యక్రమంలో భాగంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆదేశాల మేరకు రేషన్ కార్డు స్లిప్పుల అర్హులైన ప్రజలకు అందించడం జరిగింది అన్నారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం లో మాజీ ఎంపీటీసీ హన్మంత్ పటేల్, సంగ్రామ్ పటేల్, మల్లు గొండ, రవి కిరణ్, సాయి పటేల్, గంగాధర్ గ్రామ రేషన్ కార్డు లబ్ధిదారులు పాల్గొన్నారు.
- Advertisement -