నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని పెంటఖుర్దు గ్రామంలో శిథిల శివాలయముండేది. 1984లో గ్రామ సర్పంచు కీ.శే.పరుచూరు రాంచందర్ రావు, కీ.శే. యలవర్తి జయరామారావు, కీ.శే.కొడాలి సూర్యుడమ్మ దేవాలయాన్ని పునరుద్ధరించారు. పురాతన ఆలయశిథిలాలలో లభించిన శాసనస్తంభాన్ని భద్రపరిచారు. ఈ శాసనంలోని విషయాన్ని తెలుసుకోవడానికి ఆ గ్రామ నివాసులు బీవీ భాస్కర్ రెడ్డి, గడ్డం వీరరాజారావు, మద్దినేని శ్రీనివాసరావు, ముక్కల శ్రీనివాసరెడ్డి, కొత్తపల్లి నాగేశ్వరరావు, చిట్టెం శివసాయిపటేల్, గైని గంగారాం, జంగం సంజప్ప, నాగల్ల కోటేశ్వరరావు, బి.నాగిరెడ్డి, డి.హరీశ్ చేసిన కషివల్ల కొత్తశాసనం వెలుగులోనికి వచ్చింది.
కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్, చరిత్రకారులు శ్రీరామోజు హరగోపాల్ ఈ శాసనాన్ని చదివి పరిష్కరించారు.
పెంటఖుర్దు గ్రామంలో శ్రీశ్రీమల్లికార్జున దేవాలయ ప్రాంగణంలో నిలిపివున్న రాతిస్తంభానికి 3 వైపుల 47 పంక్తులలో 11వ శతాబ్దపు తెలుగున్నడలిపిలో, కన్నడభాషలో చెక్కబడిన శిలాశాసనం ఉన్నది. కళ్యాణీచాళుక్య చక్రవర్తి త్రైలోక్యమల్లదేవర పాలనాకాలంలో క్రీ.శ.1058 మార్చి 10వ తేదీన వేయబడిన సావడిగేయ పొంరయ అనే భక్తుడు నకరేశ్వరదేవాలయం కొరకు చేసిన దానాలు గురువు దివాకర భట్టారకయ్యకు అందజేసాడు. కొంతభూమి గుడి నిర్వహణకు దానంచేయబడ్డది. సూర్యగ్రహణ సందర్భంగా చేసిన దానాలలో గుడికి చెల్లేటట్లు బాటసుంకం, బిట్టకొట్టసుంకం వంటి కొన్నిరకాల పన్నులు మాఫీచేయబడ్డవి. పెంటఖుర్దుకు 4కి.మీ.ల దూరంలోని కోటవున్న కోటగిరివద్ద తోట, బావి, 25 రూకల ద్రవ్యమిచ్చినట్లు శాసనం ద్వారా తెలుస్తున్నది. ఈ శాసనం ఆనాటి సామాజిక సంస్కతికి అద్దంపడ్తున్నది. పేరులోనే ప్రాచీనతను దాచుకున్న గ్రామం పెంటఖుర్దు.
శాసన పరిష్కర్త: శ్రీరామోజు హరగోపాల్, కన్వీనర్, కొత్త తెలంగాణచరిత్రబృందం, 9949498698
సహకారం: శివాలయం భక్తులు.
పెంటఖుర్దు గ్రామంలో కొత్త కళ్యాణీచాళుక్యుల శాసనం
- Advertisement -
- Advertisement -