నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎత్తు తాండా కు చెందిన హర్జు రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు ఎస్ హెచ్ ఓ జి సందీప్ తెలిపారు. అయన తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం మండలంలోని ఎత్తు తాండా నుండి ఒక పని నిమిత్తం మండలం లోని గన్నరం గ్రామానికి ద్విచక్ర వాహనం పై బాదావత్ లాల్ సింగ్ ఇద్దరు కలిసి వస్తుండగా గన్నరం కామన్ వద్ద వేనుక నుండి వస్తున్న ఒక ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. దీంతో వేనుక కుర్చున్న బాదావత్ హర్జా (50) లాల్ సింగ్ లకు గాయలైనయి. దినిలో హర్జ కు రివ్యూ గాయాలై మృతి చెందినట్లు తెలిపారు. మృతుని కుటుంబ సభ్యులు బాదవత్ లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
ద్విచక్ర వాహనం అతివేగంగా ఆజాగ్రత్త నడపడం వలన ఈ ప్రమాదం చోటు చేసుకుందని, ప్రమాదానికి కారణమైన ద్విచక్ర వాహనం ను పోలిస్ స్టేషన్ కు తరలించారు. గాయాలపాలైన బాదావత్ లాల్ సింగ్ కు చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఆసుపత్రి కి తరలించారు.మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి మర్చూరికి తరలించినట్లు ఎస్ హెచ్ ఓ జి సందీప్ వివరించారు.