Wednesday, August 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు

తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు

- Advertisement -

కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్
నవతెలంగాణ – మల్హర్ రావు

మండలంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని పంచాయితీ రాజ్, మండల పరిషత్ అదికారులను కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ ఆదేశించారు. మంగళవారం మండలంలోని ఆన్ సాన్ పల్లి తాగునీటి సమస్యలు ఉన్నాయనే ఆరోపణలపై మిషన్ భగీరథ పైప్ లైన్లు,నీటి ట్యాoక్ లు పరిశీలించారు. ఎక్కడెక్కడా ఎక్కువ సమస్యలున్నాయి.కొత్తగా ఏమైనా బోర్ బావులు అవసరమా స్థానిక అధికారులను, ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ శ్రీనివాస్, ఆర్ డబ్ల్యూ ఎస్ ఇంఛార్జ్ ఏఈ రాజశేఖర్, పంచాయితీ కార్యదర్శి వెన్నెల,కారొబార్ శ్రీకాంత్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -