- Advertisement -
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
ఇంటర్మీడియట్ కళాశాలలో ప్రవేశాల కొరకు ఈనెల 20 వరకు గడువు పెంచినట్లు కళాశాల ఇంచార్జ్ రాజశేఖర్ తెలిపారు. పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఈనెల 20 లోగా ఇంటర్మీడియట్ కళాశాలలో చేరాలని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 88 మంది విద్యార్థులు చేరినట్లు అయినా తెలిపారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో 52 మంది చేరినట్లు ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
- Advertisement -