Wednesday, August 6, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంటీజీహెచ్‌ఎంఏ రాష్ట్ర అధ్యక్షులుగా రాజభాను చంద్రప్రకాశ్‌

టీజీహెచ్‌ఎంఏ రాష్ట్ర అధ్యక్షులుగా రాజభాను చంద్రప్రకాశ్‌

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం (టీజీహెచ్‌ఎంఏ)లో గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం (జీహెచ్‌ఎంఏ) విలీనమైంది. మంగళవారం హైదరాబాద్‌లో టీజీహెచ్‌ఎంఏ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షులుగా పి రాజభాను చంద్రప్రకాశ్‌, ప్రధాన కార్యదర్శి జి హేమచంద్రుడు, గౌరవాధ్యక్షులుగా పి మురళీకృష్ణ, ముఖసలహాదారులుగా పర్వతి సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎస్టీయూటీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎం పర్వత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి, జాక్టో చైర్మెన్‌ జి సదానందంగౌడ్‌ ఎన్నికల అధికారులుగా వ్యవహరిం చారు. బీసీటీఏ అధ్యక్షులు కె కృష్ణుడు ఎన్నికల పరిశీలకులుగా పనిచేశారు. టీజీహెచ్‌ఎంఏ జాక్టో భాగస్వామ్య సంఘంగా పనిచేస్తుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజభాను చంద్రప్రకాశ్‌ తెలిపారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ పటిష్టత కోసం పనిచేయాలని తీర్మానించామని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -