అందుకే ట్రంప్ బెదిరింపులకు
మోడీ సైలెంట్: రాహుల్
న్యూఢిల్లీ : పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై అమెరికా దర్యాప్తు కారణంగా డోనాల్డ్ ట్రంప్ నుంచి పదే పదే బెదిరింపులు వచ్చినప్పటికీ ప్రధాని మోడీ ఎదుర్కోలేకపోతు న్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత్ తమకు మంచి వాణిజ్య భాగస్వామి కాదని, రాబోయే 24 గంటల్లో సుంకాలను చాలా గణనీయంగా పెంచుతానని ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో రాహుల్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ”భారత్ ప్రజలారా, దయచేసి అర్థం చేసుకోండి. అధ్యక్షుడు ట్రంప్ పదే పదే బెదిరింపులు చేసినప్పటికీ ప్రధాని మోడీ మౌనంగా ఉండడానికి కారణం అదానీపై కొనసాగుతున్న
అమెరికా దర్యాప్తు. మోడీ, అంబానీ- అదానీ, రష్యన్ చమురు ఒప్పందాల మధ్య ఆర్థిక సంబంధాలను బహిర్గతమవుతాయి. మోడీ చేతులు కట్టేశారు” అని రాహుల్ గాంధీ ఆరోపించారు. అయితే రాహుల్ పోస్ట్‌పై ప్రభుత్వం లేదా అదానీ గ్రూప్ నుంచి స్పందన రాలేదు.
అదానీపై అమెరికాలో దర్యాప్తు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES