- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా గురువారం మద్నూర్ మండల కేంద్రంలోని ఏడవ అంగన్వాడి సెంటర్లో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ వారోత్సవాల్లో ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత పాల్గొని తల్లులకు అవగాహన కల్పించారు. పుట్టిన బిడ్డకు గంటలోపే ముర్రుపాలు పట్టాలని, బిడ్డకు ముర్రుపాలు శ్రేయస్కారమని తెలిపారు. తల్లిపాల ప్రత్యేకత గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ మాధవి ఆయా తల్లులు, కిషోర బాలికలు పాల్గొన్నారు.
- Advertisement -