- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూరు మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో గురువారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మెడికల్ అధికారి యేమిమా విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. నేషనల్ డివార్మింగ్ డే సందర్భంగా పరిశుభ్రత గురించి విద్యార్థులకు వివరించారు. 20 మంది విద్యార్థులకు వైద్య పరీక్ష నిర్వహించి మలేరియా, డెంగ్యూ రక్త పరీక్షలు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థులకు మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రఘు, వైస్ ప్రిన్సిపాల్ కిషన్, ఎం పి హెచ్ ఓ వెంకటరమణ, సూపర్వైజర్ రాజమణి, ఏఎన్ఎం యాదమ్మ, రాధిక, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు ఉన్నారు.
- Advertisement -