Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంప్రయివేటు ఫైనాన్స్ లోన్ పేరుతో మోసం చేసిన ఇరువురి పై కేసు నమోదు

ప్రయివేటు ఫైనాన్స్ లోన్ పేరుతో మోసం చేసిన ఇరువురి పై కేసు నమోదు

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రయివేట్ ఫైనాన్స్ లోన్ తో మహిళను మోసగించిన సంఘటన లో ఇరువురి పై గురువారం కేసు నమోదు అయింది. ఎస్.హెచ్.ఓ ఎస్.ఐ యయాతి రాజు తెలిపిన కధనం ప్రకారం.. అశ్వారావుపేట మున్సిపాలిటీ నందమూరి కాలనీకి చెందిన హలీమా కు అశ్వారావుపేటకు చెందిన ఫణీంద్ర,రామస్వామి లు ఎస్బీఎఫ్సీ ఫైనాన్స్ కంపెనీ లో సుమారు రూ. 7 లక్షల హౌసింగ్ లోన్ ఇప్పిస్తామని నమ్మించి వారి వద్ద నుండి బ్యాంకు కావాల్సిన  డాక్యుమెంట్స్ తో పాటు బాధితుల సంతకాలతో కూడిన చెక్కులు తీసుకొని లోన్ మంజూరు చేయించారు.

అనంతరం ఆ మొత్తాన్ని తన తమ సొంత ఖాతాలోకి బదిలీ చేయించుకుని ఒకేసారి కాకుండా విడతల వారీగా లోన్  వస్తుందని నమ్మ పలికాడు. విడతల వారిగా వారికి లోన్ సొత్తు ఇచ్చి అందులో నుండి సుమారు రూ.2 లక్షల సొత్తును నొక్కేసారు. తర్వాత బాధితులకు వాయిదాల భారం పెరగడం, బ్యాంకు నుండి నోటీసు రాగా.. బ్యాంకు వారిని సంప్రదించగా మొత్తం బండారం  బయటపడింది. ఇదే విషయం అయి విచారించగా మరొక బాధితుడు సైతం పోలీసులను ఆశ్రయించాడు. బాధితురాలు హలీమా ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసి  దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img