Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్..

బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్..

- Advertisement -

మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ …
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్  

42 శాతం బీసీ రిజర్వేషన్, కులగణాలు పేరుతో కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తుందని, బీసీ రిజర్వేషన్ ధర్నాకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ,రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కర్గే  లు ఢిల్లీ ధర్నాలో ఎందుకు డుమ్మా కొట్టారని 9 రాజ్యాంగ చట్టబద్ధత కల్పించాలని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ ప్రశ్నించారు. శుక్రవారం భువనగిరి జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఉమ్మడి నల్గొండ జిల్లాలో సొంత పార్టీ నాయకులే రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారని, అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలం చెందిందని ఆయన విరుచుకు పడ్డారు. బీసీ రిజర్వేషన్ పేరు చెప్పుకొని ఢిల్లీకి 42 సార్లు పోయొచ్చారని విమర్శించారు.

కాంట్రాక్టుల్లో  బీసీలకు 42 శాతం ఇస్తన్నవు ఆ మాట ఎక్కడికి పోయిందని,  బీసీలకు మంత్రి పదవులు, కార్పోరేట్ చైర్మన్ పదవులు ఎన్ని పదవులు ఇచ్చారు బహిరంగంగా చర్చకు రావాలని సావలు విసిరారు. బీసీల రిజర్వేషన్ పేరు చెప్పి కాలయాపన చేస్తూ స్థానిక ఎన్నికలకు పోవాలన్నదే కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రత్యేక లక్ష్యమని, బీసీ సబ్ ప్లాన్, బీసీ కాంట్రాక్టర్లు, బీసీలకు వచ్చే ప్రభుత్వం నుండి అనేక రకాల రుణా సదుపాయాలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కామారెడ్డి సభలో  ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారమే బీసీ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కి ఏ ఒక్క హామీ కూడా ఇంతవరకు నెరవేర్చలేదని అన్నారు. బీసీలకు కులవృత్తులకు ప్రత్యేక నిధులు, ప్రత్యేక హోదా బీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఏమయ్యాయని, బీసీ లు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రను గమనించాలని కోరారు.

బీసీ విద్యార్థుల ఫీజు రీబర్స్మెంట్ ఇంతవరకు మంజూరు చేయలేదని ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్లు పేరు చెప్పి మంజూరు చేసిన ఇళ్లను రద్దు చేశారని ఆరోపించారు. ఇంతవరకు ఇందిరమ్మ ఇల్లు ప్రాసెసింగ్ లో ఉన్న లబ్ధిదారులకు బిల్లులు చెల్లించలేదని మండిపడ్డారు. నిరుపేద ప్రజలు ఇండ్ల కోసమే ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీకి గెలిపించాలని, వారిని మరిచిపోయి గద్దె ఏక్కీ మాట మార్చాలని ఆరోపించారు. ఈ నెల 14న  కరీంనగర్లో పార్టీలకు అతీతంగా బీసీ గర్జన నిర్వహించబోతున్నామని సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. బీసీలను దళాలు చేసిన తర్వాత పార్టీ కాంగ్రెస్, అఖిల పక్ష నాయకులతో ధర్నా నిర్వహిస్తే, బీసీ రిజర్వేషన్ అమలు అయ్యేదని, ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్  ర్యాకల శ్రీనివాస్, కేశవపట్నం రమేష్, మాజీ ఎంపీపీలు  లక్ష్మీనారాయణ, బొబ్బూరి రవీంద్రనాథ్ గౌడ్, గడ్డమీది రవీందర్ గౌడ్, కర్రె వెంకటయ్య, పుట్టా వీరేష్ యాదవ్, మండల అధ్యక్షుడు జనగాం పాండు, నాయకులు కస్తూరి పండు, మల్లికార్జున్, నీల ఓం ప్రకాష్, సురేష్, వెంకటేష్ లు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img