Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ప్రజా సంక్షేమాన్ని కోరుకుంది బీఆర్ఎస్ పార్టీనే..

ప్రజా సంక్షేమాన్ని కోరుకుంది బీఆర్ఎస్ పార్టీనే..

- Advertisement -

తాటికొండ రాజయ్య
నవతెలంగాణ – ధర్మసాగర్
ప్రజా సంక్షేమాన్ని కోరుకుంది బీఆర్ఎస్ పార్టీ నేననీ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని కేశవనగర్, క్యాతంపల్లి, జానకీపురం, తాటికాయల, రాయి గూడెం, కాషగుడెం గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఊరూరికి బీఆర్ఎస్ సంక్షేమాలు – ఇంటింటికీ కేసీఆర్ పథకాలు కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమాల్లోఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిచింది. ప్రతి గ్రామంలో రహదారులు, తాగునీటి సదుపాయం, విద్యుత్, పింఛన్లు, రైతు బంధు, రైతు భీమా, వైద్య సేవలు – ఇవన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే సాధ్యమయ్యాయి.ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో పరిస్థితి ఏమైందో మీరు చూస్తున్నారు. రైతు బంధు కూడా సమయానికి రాదు.

ఓట్లు వేయించే సమయంలోనే రైతు బంధు ఇస్తున్నారు. ఇది రైతుల పట్ల మోసం కాదా? రైతు రుణ మాఫీ పూర్తి కాలేదు, పొరపాటున రైతు చనిపోతే రైతు కుటుంబానికి అండగా 5 లక్షలు వచ్చేవి అది ఇప్పుడు కానరాకుండ పోయిందన్నారు.కేసిఆర్ కిట్ తీసేసారు,కేవలం పేర్లు మారుస్తూ కమిషన్ల కోసం కాలం గడుపుతూ ఉన్నారు.సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కడియం శ్రీహరికి పెద్ద చెంపపెట్టులాంటిదని,నిజంగా ఆయనకు నీతి, నిజాయితీ ఉంటే వెంటనే పదవికి రాజీనామా చేసి,ప్రజాక్షేత్రంలో పోటీకి రావాలి. ప్రజలంతా కడియం శ్రీహరి మోసాన్ని అర్థం చేసుకున్నారు.కనీసం ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకోలేని పరిస్థితి లో ఆయన ఉన్నారని హేద్దెవ చేశారు.కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మోసపూరిత హామీలతోనే ప్రజలను మభ్యపెడుతుంది.

గడిచిన రెండు సంవత్సరాల్లో ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదు.ఇలాంటి పార్టీకి ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు.రేవంత్ రెడ్డి ఇప్పటికే 50 సార్లు ఢిల్లీకి వెళ్ళాడు.అక్కడ ఢిల్లీ పెద్దలకు కప్పం కట్టి వస్తున్నాడు.ప్రజలకు సేవ చేయడానికి కాదు, తన కుర్చీ కాపాడుకోవడానికి మాత్రమే ఆయన పరుగులు పెడుతున్నాడు.బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ రైతు గర్వంగా ఉండేవాడు.ఆ రోజులు మళ్లీ రావాలి అంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలి.అందరూ ఒక్కటిగా కృషి చేయాలి.కార్యక్రమాల్లో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొని రాజయ్య గారికి ఘన స్వాగతం పలికారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img