తెలంగాణ బాలోత్సవం రాష్ట్ర
కార్యదర్శి ఎన్.సోమయ్య
నవతెలంగాణ-ముషీరాబాద్
తెలంగాణ బాలోత్సవం, విశ్వమానవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు ఉచిత ట్యూషన్లు నిర్వహిస్తున్నామని తెలంగాణ బాలోత్సవం రాష్ట్ర కార్యదర్శి ఎన్.సోమయ్య, విశ్వమానవ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మస్తాన్ రావులు తెలిపారు. బాగ్‌లింగం పల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడు తూ ఇప్పటికే హైదరాబాద్ నగరంలో 10, ఇతర జిల్లాల్లో 10 సెంటర్లలో 23 మంది టీచర్లు బోదిస్తున్నారని తెలి పారు. ఈ ట్యూషన్లలో పాఠశాల పుస్తకాలు మాత్రమే కాకుండా శాస్త్రీయ, సామాజిక అవగాహన, వివిధరకాల ఆటలు, జాతీయ నాయకుల చరిత్రలు, జనరల్ నాలెడ్జ్, డ్రాయింగ్, వంటి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతి శనివారం పిల్లల నిపుణులతో భవిష్యత్తు అవగాహన తరగతులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పేద, బడుగు-బలహీన వర్గాల పిల్లల భవిష్యత్తును మెరుగు పరిచేటువంటి విధంగా ప్రోత్సహించడం కోసం, వారి ప్రతిభను వెలికి తీయడం కోసం ఉపయోగ పడతాయన్నారు. నేటి పాలకులు చిన్న పిల్లలను నేటి బాలలే రేపటి పౌరులుగా తీర్చి దిద్దే బదులు కులం పేర, మతం పేర విషం నింపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో విద్యార్థులు 10వ తరగతి లోపే డ్రాప్ ఔట్ అవుతున్నా రన్నారు. అమ్మాయిల అభివద్ధి కోసం, వారి ఆరోగ్యం, మానసిక ఒత్తిడి, ఉన్నత విద్య, ఉద్యోగాలపై ప్రత్యేక అవగాహన పెంచేందుకు తెలంగాణ బాలోత్సవం ఆధ్వర్యంలో పాఠశాలల్లో స్థాని కంగా అవగాహన సదస్సు లు ఏర్పాటు చేస్తుందన్నా రు. సామాజిక పరిణా మాలపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. జిల్లా, మండల కేంద్రాల్లోని పాఠశాల ఉపాధ్యా యులు, తల్లి దండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఇలాంటి ఉచిత ట్యూషన్ కేంద్రాలను నడిపించడానికి ముం దుకు రావాలని కోరారు. వివరాలకోసం ఈ క్రింది ఫోన్ నెంబరుకు 94900 986 76 సంప్రదించగలరని తెలిపారు.
ఉచిత ట్యూషన్లు ఉపయోగించుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES