నవతెలంగాణ -హుస్నాబాద్ రూరల్ : హుస్నాబాద్ పట్టణ కేంద్రంలోని విశ్రాంతి ఉద్యోగుల భవనంలో సోమవారం గౌడ సంఘం నాయకులు సమావేశం నిర్వహించారు.బహుజన వర్గాలను బానిసలుగా పీడించే నైజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఆగస్టు 18 న ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. సైదాపూర్ మండలంలోని కొమ్ముగుట్టలో ఆగస్టు 17న మంత్రి పొన్నం ప్రభాకర్ విగ్రహావిష్కరణ చేసే కార్యక్రమానికి గౌడ కులస్తులు బహుజన వర్గాలను పెద్ద ఎత్తున తరలించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మార్క అనిల్ గౌడ్ , బుర్ర పరశురాం గౌడ్, కోహెడ కొమురయ్య , హుస్నాబాద్ గౌడ సంఘం నాయకులు పందిళ్ళ మాజీ సర్పంచ్ తోడేటి రమేష్ గౌడ్, కోశాధికారి గట్టు రాములు గౌడ్, గాంధీనగర్ మాజీ సర్పంచ్ బొంగోని శ్రీనివాస్ గౌడ్, పూదరి వరప్రసాద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
హుస్నాబాద్ లో గౌడ సంఘం నాయకుల సమావేశం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES